Executive producer silver jubilee on 6th september.
#Dilraju
#ckalyan
#ksramarao
#RajivKanakala
#jeevitharajaseskha
సినిమా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు, అన్ని క్రాఫ్టులలో వారి హ్యాండ్ మనం చూడొచ్చు. వారే ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్లు. వారే సినిమాలో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. వాళ్ల సంక్షేమం కోసం నిర్వహించబోతున్న వేడుకకి సినీ పరిశ్రమ మొత్తం అండగా ఉంటుంది అని అన్నారు నిర్మాతలు దిల్రాజు, కె.ఎస్.రామారావు, సి.కల్యాణ్.తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ యూనియన్ ఏర్పాటై 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సెప్టెంబరు 8న హైదరాబాద్లో ‘సినీ రథ సారథుల రజతోత్సవం’ పేరుతో ఓ వేడుకని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్లో విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు. నిర్మాతలుగా తెరపైన మా పేరే ప్రముఖంగా పడినా కష్టం ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్లదే.